పెళ్లి కి వెళ్లి వచ్చేసరికి ఇల్లు ఖాళీ | theft in VEMULAWADA | Sakshi
Sakshi News home page

పెళ్లి కి వెళ్లి వచ్చేసరికి ఇల్లు ఖాళీ

Feb 4 2016 10:31 AM | Updated on Sep 3 2017 4:57 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు 7తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమరా ఎత్తుకెళ్లారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు 7తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమరా ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మార్కండేయనగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జనార్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చాడు. అప్పటికే తాళం పగలగొట్టి ఉండటంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement