రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల దెబ్బలు తాళలేక ఓ రిమాండ్ ఖైదీ శుక్రవారం మృతిచెందాడు.
ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అదేనెల 21న మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలుగు రోజులు జిల్లా జైలులో చికిత్స అందించినా దెబ్బలు తగ్గలేదు. దీంతో గతనెల 26న సివిల్ ఆస్పత్రికి పంపించగా మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో ఇన్‌పేషెంట్‌గా చేర్చారు. గురువారం వెంకటేశ్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించాలని జైలు సిబ్బందికి ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగానే శుక్రవారం తెల్లవారుజామున వెంకటేశ్ మృతిచెందాడు. వెంకటేశ్ రిమాండ్ ఖైదీ కావడంతో నిబంధనల ప్రకారం జిల్లా జడ్జి, ఆర్డీవో, తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని జ్యుడీషియల్ విచారణ ప్రారంభించారు. అయితే తన భర్తను పోలీసులే కొట్టి పొట్టన బెట్టుకున్నారని వెంకటేశ్ భార్య రేణుక ఆరోపిస్తోంది.