ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌తో ఇరువర్గాల మధ్య ఘర్షణ | The conflict between the two sides with Facebook posting | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌తో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Sep 9 2017 3:00 AM | Updated on Jul 26 2018 1:02 PM

ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గం మనోభావాలు దెబ్బతినే రీతిలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

సాక్షి, ఆసిఫాబాద్‌: ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గం మనోభావాలు దెబ్బతినే రీతిలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ విషయం తెలిసి ఓ వర్గం యువకులు కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీచౌక్‌ వద్ద శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు.

దీంతో వెంటనే రూరల్‌ ఎస్‌ఐ రాజేశ్, దహెగాం ఎస్‌ఐ రమేశ్‌లు వచ్చి యువకులను అక్కడ నుంచి పంపించేశారు. యువకులు ర్యాలీగా వెళ్తుం డగా మరో వర్గం యువకులు వీరిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ రాజేశ్‌ తలకు గాయాలయ్యా యి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ హబీబ్‌ఖాన్‌లు సీఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు దారి తీసిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement