Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్‌నాథ్ యాత్రికులు | Viral Video: All Out Brawl Among Kedarnath Pilgrims | Sakshi
Sakshi News home page

Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్‌నాథ్ యాత్రికులు

Jun 19 2025 6:42 PM | Updated on Jun 19 2025 7:51 PM

Viral Video: All Out Brawl Among Kedarnath Pilgrims

కేదార్‌నాథ్ యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్‌లో జరిగిన ఈ ఘటనలో యాత్రికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారు.

పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్‌ కూడా చేశారు. కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్‌ప్రయాగ్‌లోని పార్కింగ్‌ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. దాడులు చేసుకున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభం నుంచి తరుచూ ఇలాంటి ఘటనలు అశాంతిని కలిగిస్తున్నాయి.

కేదార్‌నాథ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో​ తరలివస్తున్నారు. స్థానిక అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2న ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి 1.14 మిలియన్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, పోర్టర్లు, హెలి ఆపరేటర్ల సంబంధిత సేవల వ్యాపారం రూ.300 కోట్లు దాటింది.

Advertisement
 
Advertisement
Advertisement