
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్స సృష్టించింది. గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్ని ధ్వంసమయ్యాయి. శిధిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ 60మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి.
అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్థులు కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగగా.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక, క్లౌడ్ బరస్ట్‌లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌబ్ బరస్ట్ జరిగిందని తెలిపారు.
BREAKING: Dehradun: Massive flood in the Khir Ganga river in Uttarkashi. Water carrying silt cascades into Tharali village. Many feared trapped. Disaster teams rushed. pic.twitter.com/wtXVrqYBzL
— Rahul Shivshankar (@RShivshankar) August 5, 2025
క్లౌడ్ బరస్ట్ కారణంగా హర్సిల్‌లోని ఖీర్‌ఘడ్‌లో నీటి స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ బరస్ట్‌తో భారీగా నష్టపోయిన ధరాలీకి పోలీసులు,ఎస్‌డీఆర్‌ఎఫ్,విపత్తు బృందాలు మొహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశిలోని ధరావలిలో క్లౌడ్ బరస్ట్ గురించి నాకు సమాచారం అందింది. మేం ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.