చెరువులోకి దూసుకెళ్లిన కారు | The car into the pond | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన కారు

Aug 7 2017 2:12 AM | Updated on Apr 3 2019 7:53 PM

చెరువులోకి దూసుకెళ్లిన కారు - Sakshi

చెరువులోకి దూసుకెళ్లిన కారు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో సరదాగా గడుపుదా మని వచ్చిన ఓ స్నేహితుడు ప్రమాదం బారిన పడి ఆ కుటుంబంలో విషాదం నింపాడు.

అలుగు చూసేందుకు వెళ్లగా ప్రమాదం
సత్తుపల్లి రూరల్‌: స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో సరదాగా గడుపుదా మని వచ్చిన ఓ స్నేహితుడు ప్రమాదం బారిన పడి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. సత్తుపల్లికి చెందిన సింగరేణి ఉద్యోగి మల్లిశెట్టి కొండేశ్వరరావు తనయుడు హిమకిరణ్, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్‌షాపు యజమాని కొక్కొండ గిరిబాబు తనయుడు వినోద్‌(22) మంచి మిత్రులు. ఆదివారం బేతుపల్లి చెరువు అలుగును చూసేందుకు వెళ్లగా.. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

అందు లోని ఇద్దరు కారు డోర్లు తీసుకొని కారుపైకి వచ్చారు. స్థానికులు రక్షించేందుకు చెరువులోకి వెళ్లి ఒడ్డుకు తీసుకొస్తుండగా.. వినోద్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ పడిపోవడంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా జారి చెరువులో పడిపోయాడు. పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా చిక్కలేదు. హిమకిరణ్‌ను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement