వికారాబాద్ మండలం అంతగిరిపల్లె సమీపంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది.
వికారాబాద్ మండలం అంతగిరిపల్లె సమీపంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు మహిళను బాగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలు తాండూరుకు చెందిన వరలక్ష్మి(36)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.