వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్! | Textile Park in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్!

Nov 26 2014 2:18 AM | Updated on Aug 11 2018 7:28 PM

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్! - Sakshi

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్!

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.

హన్మకొండ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. వరంగల్‌లో టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. టెక్స్‌టైల్ రంగంలో ప్రత్యేకమైన ఇన్సెంటీవ్‌ను వరంగల్, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో నెలకొల్పడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఆజాంజాహి మిల్లు మూతతో దాదాపు 30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. దీంతో ఆ ప్రాంతం వెలవెల బోతుందన్నారు. కేసీఆర్ సీఎం కావడం, వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా మార్చుతామనడం సంతోషంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయనే నమ్మకం ఉందన్నారు.

ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత.. మహిళలు, బీసీ, మైనారిటీలకు ఇన్సెంటీవ్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. నూతన పారిశ్రామిక విధానంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఏదైన కార్యక్రమం తీసుకుంటున్నారా అన్నారు. ఇన్నోవేటీవ్, ఇన్‌క్యూబిరేట్,ఇన్‌కార్పొరేట్ విధానం ద్వారా లబ్ధి జరుగుతుందో తెలియజేయాలని కోరారు. అదేవిధంగా బిల్ట్‌లో 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement