సొమ్మూ మనదే.. సోకూ మనదే.. | Telangana State Formation day | Sakshi
Sakshi News home page

సొమ్మూ మనదే.. సోకూ మనదే..

Jun 5 2017 12:49 AM | Updated on Aug 14 2018 11:02 AM

సొమ్మూ మనదే.. సోకూ మనదే.. - Sakshi

సొమ్మూ మనదే.. సోకూ మనదే..

అనేక ఆకాంక్షల నేపథ్యంలో కొట్లాడి తెచ్చు కున్న రాష్ట్రంలో సొమ్ము మనదే..సోకూ మనదే..’అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నా రు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపులో మంత్రి ఈటల
హుజూరాబాద్‌: ‘అనేక ఆకాంక్షల నేపథ్యంలో కొట్లాడి తెచ్చు కున్న రాష్ట్రంలో సొమ్ము మనదే..సోకూ మనదే..’అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నా రు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని కరీం నగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని హైస్కూల్‌ క్రీడామైదానంలో నిర్వహించారు. ముందుగా మంత్రి అంబేడ్కర్‌ చౌరస్తాలోగల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతోందని వివరించారు. అనంతరం బాలింతలకు కేసీఆర్‌ కిట్‌లు అందించారు.  కార్యక్రమం లో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement