లైసెన్స్‌ రద్దు.. గోల! 

Telangana Police And RTO Officials Not Looking Into Penalty Points Policy - Sakshi

ఆర్టీఏ, ట్రాఫిక్‌ సమన్వయ లోపం

నటుడు రాజశేఖర్‌ లైసెన్స్‌ రద్దు నేపథ్యంలో తెరపైకి విభేదాలు

సాక్షి, హైదరాబాద్‌: పెనాల్టీ పాయింట్ల విధానం అమలు, డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు విషయంలో పోలీసు, రవాణా శాఖలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ విషయంలో ఇటీవల సినీనటు డు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఆర్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. బాగా తీవ్రమైన కేసుల్లో మినహా ఇతర సంద ర్భాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలన్న ఆలోచన ఇరు శాఖల్లో కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.  గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు రద్దు చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. 

తనిఖీలు అంతంతే...
ఉభయ శాఖల నిర్లక్ష్యం, సమన్వయ లో పం ట్రాఫిక్‌ ఉల్లంఘన లకు పాల్పడేవారికి బా గా కలసివస్తోంది. ఎ లాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డా.. చలాన్లు కట్టే సి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అదే డ్రైవింగ్‌ లైసెన్సు రద్దయితే.. కాస్తోకూస్తో క్రమశిక్షణ గా ఉండేవారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు వరుసగా అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల నేప థ్యంలో అదనపు విధుల కారణం గా 12 పెనాల్టీ పాయింట్ల నమోదు ప్రక్రియను పోలీసులు పెద్దగా పట్టించుకో లేదు. కొంతకాలంగా సాధారణ వాహన తనిఖీలు కూడా సరిగా జర గడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

నెమ్మదించిన 12 పాయింట్ల విధానం.. 
నిర్లక్ష్యపు డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు తెలంగాణ ప్రభుత్వం 12 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్‌ జంప్‌ తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తి పట్టుబడితే అతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌కు పెనాల్టీ పాయింట్లు జత చేస్తారు. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా పెనాల్టీ పాయింట్లు నిర్ణయిస్తారు.

వీటిని రవాణా శాఖ ఎం–వ్యాలెట్‌లోనూ పొందుపరుస్తారు. కానీ కొంతకాలంగా పోలీసులు కేవలం చలాన్లాకే పరిమితమవుతున్నారని, 12 పెనాల్టీ పాయింట్లకు సంబంధించి నమోదు సరిగా జరగడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పోలీసులు పంపిన సిఫారసులను ఆర్టీఏ కూడా అంతే తేలిగ్గా తీసుకుంటుందని పోలీసు శాఖ వారు ఆరోపిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top