మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి... | telangana mlas demand for salaries hike | Sakshi
Sakshi News home page

మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి...

Mar 14 2015 11:22 AM | Updated on Oct 30 2018 5:17 PM

మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి... - Sakshi

మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి...

తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి భారీ నజరానా ప్రకటించటంతో మరోవైపు నియోజకవర్గ ...

హైదరాబాద్ :  తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి భారీ నజరానా ప్రకటించటంతో మరోవైపు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా తమకు జీతాలు పెంచాలని కోరుతున్నారు. తమ జీతం నెలకు రూ.3 లక్షలకు  పెంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ లాబీలో సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణ పత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు...ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేయనున్నారు.

కాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశముంది.  రాష్ట్రలోని 120 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయి. సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ సెక్రటరీలు మినహాయిస్తే మిగతా 124 మందికీ రూ. 2 లక్షల చొప్పున జీతాలు చెల్లించాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement