నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

Telangana Intermediate Results Will Be Released On 18th April - Sakshi

సాయంత్రం 5 గంటలకు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.

ఈ ఫలితాలను విద్యార్థులు www.sakshieducation.com వెబ్‌సైట్‌లో పొందవచ్చు. అలాగే టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. ప్రిన్సిపాల్స్‌ కాలేజీల వారీగా ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి  www.bie.telangana.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top