రధాన ఓటు బ్యాంకు రైతులకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ : ప్రధాన ఓటు బ్యాంకు రైతులకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీ ప్రకటనకు కట్టుబడి ఉన్నామని బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ఆయన అన్నారు. రైతుల రుణాల మాఫీకి 2015-16లో రైతు రుణ మాఫీకి రూ.4250 కోట్లు కేటాయించారు. దీంతో పాటు కూరగాయల మార్కెటింగ్‌కు 'మన ఊరు - మన కూరగాయలు' పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని 19.53లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఏడు గంటల విద్యుత్ ఇస్తామని తెలిపారు.
కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను ఈటెల తన బడ్జెట్‌లో ప్రకటించారు . 2014-15లో ఆర్థికాభివృద్ధి 5.3శాతమని, వచ్చే ఏడాది మరింత ఆశాజనకంగా ఉండొచ్చన్నారు. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 30శాతం తక్కువ వర్షాలు పడ్డాయని, గత ఏడాదితో పోల్చితే 42 శాతమేనని అన్నారు. బడుగు బలహీన వర్గాల రైతులకు భూమి ఇచ్చేందుకు అదనంగా మరింత భూమిని కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.2 నుంచి రూ.7లక్షల చొప్పున 9 జిల్లాల్లో సాగుభూమిని కొనుగోలు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు.