తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు | telangana budget highlights | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

Mar 11 2015 10:05 AM | Updated on Mar 25 2019 3:09 PM

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు - Sakshi

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చిందనకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తామని, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని, జీవం లేని అంకెల కూర్పు కాదని.. సారం లేని గణాంకాలు అంతకన్నా కాదన్నారు.  బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు.  సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు:
*  తెలంగాణ బడ్జెట్ రూ.1,10,500 కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 52, 383  కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు
* ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ.16,969 కోట్లు
* రెవిన్యూ మిగులు : రూ. 531 కోట్లు

* పన్నుల రాబడి రూ.12,823 కోట్లు
*ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు
* గిరిజన ఎస్టీ సంక్షేమం రూ.2,578 కోట్లు
* బీసీ సంక్షేమం రూ.2,172 కోట్లు
* మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు
* ఆసరా పెన్షన్లు రూ.4వేల కోట్లు

*కేంద్ర పన్నుల వాటా: రూ.12, 823 కోట్లు
* గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.526 కోట్లు
* విద్యా రంగానికి రూ.11,216
* విద్యుత్ శాఖకు రూ.7,400
* మిషన్ కాకతీయకు రూ.2,083
* ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.22,889
*ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు
* హైదరాబాద్ నీటి సరఫరాకు వెయ్యి కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 771 రూ. కోట్లు

* ఆర్టీసీకి రూ.400 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు
*  గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు
* ఉస్మానియా యూనివర్శిటీ రూ.238 కోట్లు
* అటవీ శాఖ, పర్యావరణానికి రూ.325 కోట్లు
* తెలంగాణ వాటర్ గ్రిడ్కు రూ.4వేల కోట్లు
* రోడ్లు అభివృద్ధికి రూ.2,421 కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు
*లక్ష ఎకరాల సాగు నీరందించటమే లక్ష్యం

* పారిశ్రామిక ప్రోత్సహాలకు రూ. 974 కోట్లు
*బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు
* దళితుల భూముల కొనుగోలుకు వెయ్యి కోట్లు
* అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంపు
* అంగన్వాడీ టీచర్లకు రూ.7వేలు, కార్యకర్తలకు రూ.4వేలు
* ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్టైమ్ గ్రాంట్
* వైద్య శాఖకు రూ.4,932 కోట్లు
* ఆహార భద్రత, సబ్సిడీకి రూ.1,105 కోట్లు

*ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ
*హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్
* ఫ్లై ఓవర్లకు రూ.1600 కోట్లు
* సిటీ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.50వేలు
* గ్రామీణ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.25 వేలు
* పంచాయతీ రాజ్కు రూ.2,421 కోట్లు
* కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement