తెలంగాణలో మే 14న ఎంసెట్, 21న ఈ సెట్ | telangana announces dates of entrance tests | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మే 14న ఎంసెట్, 21న ఈ సెట్

Jan 19 2015 4:43 PM | Updated on Sep 5 2018 8:36 PM

తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఆయన ప్రకటించారు.

మే 14వ తేదీన ఎంసెట్, మే 19న లాసెట్, 21వ తేదీన ఈసెట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అలాగే.. మే 22న ఐసెట్, 25న పీఈ సెట్, జూన్ 6న ఎడ్సెట్ నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే.. వాళ్లకు కూడా సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement