
గుజరాత్ తర్వాత తెలంగాణే..
దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కేవలం రెండేనని, గుజరాత్‌తో పాటు తమది ఒకటని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సగర్వంగా ప్రకటించారు.
హైదరాబాద్ : దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కేవలం రెండేనని, గుజరాత్‌తో పాటు తమది ఒకటని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సగర్వంగా ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేందుకు తాపత్రయపడ్డారు.
కొత్తగా ప్రజాకర్షక పథకాల జోలికిపోకుండా.. ఉన్న పథకాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన భూ క్రమబద్ధీకరణను క్రెడిట్‌గా చెప్పుకున్న ఈటెల రాజేందర్.. బంగారు తెలంగాణ మరెంతో దూరంలో లేదని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయకు అగ్ర తాంబూలం వేసిన ఈటెల.. మేడిన్ తెలంగాణ ఉత్పత్తులు రావాలని ఆకాక్షించారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.115689 కోట్లని, అందులో ప్రణాళికా వ్యయం రూ. 52383కోట్లు, ప్రణాళికేతర వ్యం రూ.63306 కోట్లగా పేర్కొన్నారు.