సీసీఐ ఎండీని కలిసిన టి.టీడీపీ నేతలు | telanagana tdp leaders meet cci md dk mishra | Sakshi
Sakshi News home page

సీసీఐ ఎండీని కలిసిన టి.టీడీపీ నేతలు

Oct 31 2014 6:01 PM | Updated on Apr 7 2019 3:47 PM

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎండీ డీఏ మిశ్రాను శుక్రవారం తెలంగాణ టీడీపీ నాయకులు కలిశారు.

న్యూఢిల్లీ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎండీ డీఏ మిశ్రాను శుక్రవారం తెలంగాణ టీడీపీ నాయకులు కలిశారు. తమ ప్రాంతంలో పత్తికి మద్దతు ధర చెల్లించడం లేదని మిశ్రా దృష్టికి తీసుకొచ్చారు. పత్తిలో 25 శాతం తేమ ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు.

సిబ్బంది కొరత కారణంగా సీసీఐ ఇప్పటివరకు 65 క్వింటాళ్ల పత్తి కోనుగోలు చేసిందని తెలిపారు. దీంతో పత్తి దళారులు రైతులను మోసం చేస్తున్నారన్న విషయాన్ని సీసీఐ ఎండీ దృష్టికి తీసుకోచ్చారు. వరంగల్, ఆదిలాబాద్, మార్కెట్లలో పర్యటించాలని మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement