ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములవ్వాలి | Swachh Bharath Mission Awareness Conference in adilabad | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములవ్వాలి

Jun 17 2017 1:04 PM | Updated on Aug 17 2018 2:56 PM

ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఎం.జ్యోతి బుద్ధప్రకాశ్‌ అన్నారు.

► కలెక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌

ఆదిలాబాద్‌: ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఎం.జ్యోతి బుద్ధప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకోవాలని అన్నారు. గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చుకోవాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

గ్రామాల్లోని ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించే గ్రామాల వివరాలు ఎంపీడీఓలు తెలియజేయాలన్నారు. 26 గ్రామాలను ప్రకటిస్తామని ఆయా మండలాల ఎంపీడీఓలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మూర్తి, ఈఈ దేవేందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ రాజేశ్వర్‌రాథోడ్, జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ రాజీవ్‌రాజు, యూనిసెఫ్‌ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement