బావిలో పడి విద్యార్థి మృతి | Student fell into the well and killed | Sakshi
Sakshi News home page

బావిలో పడి విద్యార్థి మృతి

Apr 6 2016 8:42 AM | Updated on Nov 9 2018 5:02 PM

పాల్‌టెక్నిక్ విద్యార్థి బావిలో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం వెలుగుచూసింది.

పాల్‌టెక్నిక్ విద్యార్థి బావిలో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం వెలుగుచూసింది. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన దుర్గం వేణు(22) స్థానిక భగత్ కళాశాలలో పాల్‌టెక్నిక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. బావిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement