జిల్లాకు కొత్త ఎస్పీగా ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు.
సాక్షి, రంగారెడ్డి: జిల్లాకు కొత్త ఎస్పీగా ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసులుది 2008 ఐపీఎస్ బ్యాచ్. గతంలో ఏసీబీ విజిలెన్స్ విభాగంలో పనిచేశారు. అలాగే వైజాగ్ డీసీపీగానూ ఆయన విధులు నిర్వహించారు. ఈయనకు సమర్థత ఉన్న అధికారిగా పేరుంది.