రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు

Srinivas Goud Requested NRIs To Invest In Telangana - Sakshi

ఎన్నారైలను కోరిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ పురపాలిక పరిధిలోని ఎదిర శివారులో 500 ఎకరాలలో ఐటీ టవర్, మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్‌ దేశాలలో పర్యటిస్తున్న మంత్రికి, తెలంగాణ సింగపూర్‌ కల్చరల్‌ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ వారితో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం క్రియాశీల విధాన చర్యలు చేపట్టిందని, ఇందుకోసం పలు నిర్ధిష్టమైన విధానాలు తెచ్చిందని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top