పలు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Some Passenger Trains Canceled Due To Repairs - Sakshi

కొమురం భీం ఆసిఫాబాద్‌: పలు ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నుంచి రద్దు చేసింది.  పెద్దంపేట నుంచి మంచిర్యాల వరకు రైల్వే మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 8 వరకు రద్దు చేస్తున్నట్లు స్థానిక రైల్వే అధికారులకు ఉత్తర్వులు అందాయి.

కరీంనగర్‌ నుంచి సిర్పూర్‌( రైలు నెంబర్‌ 77255), సిర్పూర్‌ నుంచి కరీంనగర్‌(77256), కాజీపేట్‌ నుంచి బల్లర్ష(77121), సిర్పూర్‌ నుంచి కాజీపేట్‌(57122), అజ్ని నుంచి కాజీపేట్‌(57135), కాజీపేట్‌ నుంచి అజ్ని(57136) మధ్యలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కాగజ్‌ నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును కాజీపేట్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు మాత్రమే నడుస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top