పదహారేళ్లుగా వెట్టి | Sixteen penal | Sakshi
Sakshi News home page

పదహారేళ్లుగా వెట్టి

Apr 2 2014 3:47 AM | Updated on Sep 2 2017 5:27 AM

పదహారేళ్లుగా వెట్టి

పదహారేళ్లుగా వెట్టి

ఆ భూమి లక్షల విలువ చేస్తోంది. ఆత్మకూర్ శివారులోనే ఉన్న ఆ వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉప కేంద్రం నిర్మించేందుకు పూనుకున్నారు.

ఆ భూమి లక్షల విలువ చేస్తోంది. ఆత్మకూర్ శివారులోనే ఉన్న ఆ వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉప కేంద్రం నిర్మించేందుకు పూనుకున్నారు. దీనికి గాను భూమి ఇస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి లక్షల విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకొని నేటి కీ భూమి ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వనేలేదు. వివరాలు.. ఆత్మకూర్ మండలం ఖానాపూర్ శివారులో (ఆత్మకూర్‌కు అతి సమాపంలో) ఉన్న సర్వే నెం.128లో ఖానాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు సంబంధించిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

ఆత్మకూర్‌లో విద్యుత్ ఉప కేంద్రం లేని కారణంగా పట్టణ శివారులో ఉన్న ఆ భూమిని ట్రాన్స్‌కో అధికారులు ఎంపిక చేశారు. ఆ భూమిలోంచి అర ఎకరం ఇస్తే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో లక్షల విలువ చేసే భూమిని 1997లో అధికారులకు అప్పజెప్పారు. అనంతరం విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం పూర్తి స్థాయిలో జర గడంతో సెప్టెంబర్ 29, 1998లో  ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్తకోట దయాక ర్‌రెడ్డి, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కేఎస్‌ఎన్‌మూర్తి, ఎస్‌ఈ వైసీ కొండారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం వికలాంగుడైన కుర్వ మల్లేష్‌కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక వాచ్‌మెన్‌గా విధుల్లో చేర్చుకున్నారు. ఐదేళ్లపాటు కాస్తో, కూస్తో జీతం చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకున్నారు.  అనంతరం తమకు వాచ్‌మెన్ అక్కరలేదని అధికారులు పేర్కొనడంతో మల్లేష్ బిత్తరపోయాడు. ఈ విష యమై ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు కాళ్లావేళ్లా పడి ప్రాధేయప డ్డా ఇది తమ చేతుల్లో ఏమీ లేదని, ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం.

ఉన్న కాస్త భూ మిలో   వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగలు ఉండటంతో వ్యవసాయానికి ఆ భూమి ప నికిరాకుండా పోయిం దని, జీవనాధారం కోల్పోయామని బాధిత కుటుంబం ఆందోళ న వ్యక్తం చేస్తోంది. అరుునా తనపై అధికారులకు కనికరం వ స్తుందేమోనని ప్రతిరోజు అతను విధులకు హాజరవుతున్నాడు. ట్రా న్స్‌కో అధికారులు ఎలాంటి వేతనం ఇవ్వకపోవడంతో తోటి కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు రూ.500 చొప్పున ప్రతినెల రెండువే లుఇస్తూమానవత్వాన్ని చాటుకుంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement