మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ పెంచాలని శుక్రవారం పీఆర్‌టీయూ, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సర్వోత్తంరెడ్డి, రాజిరెడ్డి, భుజంగరావు హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ పెంచాలని శుక్రవారం పీఆర్‌టీయూ, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సర్వోత్తంరెడ్డి, రాజిరెడ్డి, భుజంగరావు హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఫిట్‌మెంట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే గత పీఆర్‌సీల్లో సీనియర్ ఉపాధ్యాయులకు వేతనాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేలా చర్యలు చేపట్టాలని పీఆర్‌టీయూ-తెలంగాణ, టీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, రామచంద్రం, రఘునందన్ కోరారు.


