రాజన్న సన్నిధిలో మిన్నంటిన శివన్నామస్మరణ | shiva ratri at vemula vada | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో మిన్నంటిన శివన్నామస్మరణ

Feb 17 2015 2:37 PM | Updated on Oct 8 2018 4:35 PM

తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడి సన్నిధికి శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు.

వేములవాడ: తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడి సన్నిధికి శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికే సుమారు 4 లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి విచ్చేసినట్లు అంచనా. టీటీడీ అర్చకులు, జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. టీటీడీ అర్చకులు, జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement