పంచలోహ విగ్రహ దొంగల అరెస్ట్ | Satu puluh satu statue arrest pirates | Sakshi
Sakshi News home page

పంచలోహ విగ్రహ దొంగల అరెస్ట్

Oct 3 2014 2:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

పంచలోహ విగ్రహాన్ని అక్రమంగా విక్రరుుస్తున్న నలుగురిని వరంగల్ సీసీఎస్ పోలీసు లు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీస్‌స్టేష న్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

వరంగల్ క్రైం : పంచలోహ విగ్రహాన్ని అక్రమంగా విక్రరుుస్తున్న నలుగురిని వరంగల్ సీసీఎస్ పోలీసు లు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీస్‌స్టేష న్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు. జిల్లాలోని కొత్తగూడ మం డలంలోని వేలుబెల్లి గ్రామానికి చెందిన కనకంటి సంపత్, ఇదే మండలానికి చెందిన వాసం సురేష్, నెక్కొండ మండల కేంద్రానికి చెందిన యాట పూర్ణచందర్, కాజీపేట సిద్ధార్థనగర్‌కు చెందిన ఖమ్మం కృష్ణలు స్నేహితులు.

ఇందులో సంపత్, సురేష్‌లు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండ గా, పూర్ణచందర్ కూలీగా, ఖమ్మం కృష్ణ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే వాసం సురేష్ ఇటుకల తయారీకి కావాల్సిన మట్టికోసం కొద్దిరోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో మట్టి గడ్డను తవ్వుతుండగా అక్కడ ఒక బండరాయి బయటపడింది. దానిపై సూర్యుడు, చంద్రుడు, శంకరుడు బొమ్మలు చెక్కి ఉండడంతో సురేష్ నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఆంజనేయస్వామి భక్తుడు పూర్ణచందర్ కు విషయం చెప్పాడు. దీంతో సురేష్, పూర్ణచందర్ లు కలిసి ఇటీవల బండరాయి కనిపించిన ప్రదేశాని కి చేరుకున్నారు.

అయితే బండరాయి బయటపడిన ప్రాంతంలో మరికొద్ది లోతు తవ్వితే పంచలోహ వి గ్రహాలు, గుప్తనిధులు లభిస్తాయని పూర్ణచందర్.. సురేష్‌కు సూచించాడు. దీంతో వారు పక్కనే ఉన్న మరో రైతు సంపత్‌తో కలిసి బయటపడిన బండరా యి ప్రదేశంలో లోతుగా తవ్వడంతో ఏకదంతంపై వినాయకుడు చెక్కి ఉన్న పంచలోహ విగ్రహం బయటపడింది.

అయితే విగ్రహం విలువైనదిగా గ్రహించిన నిందితులు దానిని ప్రభుత్వానికి అందించకుండా ఖమ్మం కృష్ణ ద్వారా విగ్రహాన్ని బయట వి క్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు విగ్రహాన్ని పట్టుకుని  కాజీపేట రైల్వే బ్రిడ్జి పరి సర ప్రాంతంలో కొనుగోలుదారుడి కోసం గురువా రం వేచిచూస్తున్నారు. స్థానికుల సమా చారం మేర కు క్రైం ఇన్‌స్పెకర్ ఆదినారాయణ సిబ్బందితో కలిసి నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని ఒప్పుకున్నారు.

అనంతరం వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ తెలి పారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అర్బన్ క్రైం డీఎస్పీ రాజామహేంద్రనాయక్, ఇన్స్‌పెక్టర్ ఆదినారాయణ, ఎస్సై లక్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ టి.వీరస్వామి, కె.శివకుమార్, సదానందం, కానిస్టేబుళ్లు మహేశ్వ ర్, రవికుమార్, జంపయ్యను ఎస్పీ నగదు బహుమ తి ప్రకటించి అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement