సంక్షేమఫలాలు అందించేందుకే ర్యాలీ | Sanksemaphalalu andincenduke Rally | Sakshi
Sakshi News home page

సంక్షేమఫలాలు అందించేందుకే ర్యాలీ

Sep 15 2014 2:54 AM | Updated on Sep 2 2017 1:22 PM

సంక్షేమఫలాలు అందించేందుకే ర్యాలీ

సంక్షేమఫలాలు అందించేందుకే ర్యాలీ

ఆదిలాబాద్ రూరల్ : దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన సైనికులు.. వారి కుటుంబాలకు ఉపాధి, సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ర్యాలీ, సదస్సు నిర్వహించామని ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా గ్రూప్ ఆఫీసర్స్ కమాం డెంట్, చీఫ్ సెనామెడల్ అవార్డు గ్రహీత

ఆదిలాబాద్ రూరల్ :
 దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన సైనికులు.. వారి కుటుంబాలకు ఉపాధి, సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ర్యాలీ, సదస్సు నిర్వహించామని ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా గ్రూప్ ఆఫీసర్స్ కమాం డెంట్, చీఫ్ సెనామెడల్ అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ జగ్బీర్‌సింగ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ సమీపంలోని మావల గ్రామంలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్‌లో మాజీ సైని కుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశం కోసం జీవితం త్యాగం చేసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని వారి కోసం ఈ  ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మా జీ సైనికులకు ఉద్యోగ, ఉపాధి ప్రభుత్వ సంక్షేమ పథకాలందిస్తామన్నారు. సైన్యంలో పనిచేసిన కాలంలో ఉన్న క్రమశిక్ష ణ సర్వీసు అనంతరం కూడా కొనసాగించాలన్నారు. యువకులకు ఆర్మీపై అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రా ఏరి యా మేజర్ జనరల్ సీఏ పిట్టావాలా మాట్లాడుతూ.. సైనిక సంక్షేమ కేంద్రాన్ని సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశామని.. అక్కడ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు. అంతకుముందు స్టాళ్లను సందర్శించారు. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జగన్మోహన్, ఆర్టినరీ కమాం డెంట్ ఏకే సాస్‌మాన్, డెప్యూటీ కమాండెంట్ కల్నల్ శ్రీని వాస్, ఆయా జిల్లాల సైనిక సంక్షేమాధికారులు, వీరనారులు, రిటైర్డ్ ఆర్మీలు పాల్గొన్నారు.


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement