ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం
ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కొడుకు ఈతకు వెళ్లి మరణించాడు. కూతురును పోషించుకుంటూ పరంధామ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి పరంధామ తన పరిస్థితిని వివరించాడు. దీంతో స్పందించిన సీఎం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.