పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న మద్యం దుకాణం గోదాంలో దొంగలు పడి రూ. 60 వేల విలువైన మద్యం బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు.
పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న మద్యం దుకాణం గోదాంలో దొంగలు పడి రూ. 60 వేల విలువైన మద్యం బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం వెనుక వైపు ఉన్న కిటికీ తొలగించిన దుండగులు విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇది గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.