రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ | Revanth reddy remanded to ACB for 4 days | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ

Jun 5 2015 4:59 PM | Updated on Aug 29 2018 6:26 PM

రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ - Sakshi

రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించారు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించనున్నారు. రేవంత్ రెడ్డిని నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుంటారు.

ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కస్టడీకి అప్పగించారు. అడ్వకేట్ సమక్షంలో వీరిని విచారించాలని కోర్టు ఆదేశించింది. కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement