రాజమౌళి అద్భుత దర్శకుడు: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

రాజమౌళి అద్భుత దర్శకుడు: కేటీఆర్

Published Fri, Jun 26 2015 8:05 PM

రాజమౌళి అద్భుత దర్శకుడు: కేటీఆర్ - Sakshi

హైదరాబాద్: 'నేను సినిమా ప్రియుణ్ని.. రాజమౌళి అద్భుత దర్శకుడు..' ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఆయన శుక్రవారం ట్విట్టర్లో 'ఉయ్ ఆర్ హైదరాబాద్' లైవ్ చాట్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా అన్నారు. ఈ లైవ్ షోలో పలువురు నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఓటుకు కోట్లు వ్యవహారంపైనే కేటీఆర్కు ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. బాస్ అరెస్టు ఇంకా ఎందుకు అరెస్టు కాలేదంటూ  నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కేటీఆర్ సమాధానమిచ్చారు.

త్వరలోనే హైదరాబాద్కు గూగుల్ స్ట్రీట్ వ్యూ వస్తుందని తెలిపారు. అదే విధంగా వరంగల్, కరీంనగర్లలో పలు కంపెనీల బీపీఓలు ఏర్పాటు కానున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్.. 'నేనొక సినిమా ప్రియుణ్ని.. రాజమౌళి అద్భుత దర్శకుడు' అని ట్వీట్ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement