కోర్టుల్లో తక్షణ న్యాయం జరగట్లేదు

Raghvendra Singh Chauhan Attend To Doctors Day Program - Sakshi

వైద్యుల్లాగే బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి

ప్రపంచ వైద్యుల దినోత్సవంలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ‘బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంటారు. నొప్పితో బాధపడే వారు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. నొప్పి నుంచి వైద్యులు వెంటనే ఉపశమనం కల్పిస్తుండగా.. కోర్టుల్లో మాత్రం తక్షణ న్యాయం జరగడం లేదు’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హై9 వెబ్‌ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్‌ డేకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యుల్లాగే తామూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే వైద్యులు, రోగులకు మధ్య అవినాభావ సంబంధం తగ్గిందని, ఫలితంగా సమాజంలో వైద్యులకు గౌరవం తగ్గిందని అన్నారు. సామాజిక బాధ్యతగా రోగులకు సేవ చేయాల్సిన వైద్యులు.. ఆర్థికలావాదేవీలే ప్రధానంగా భావిస్తున్నారని చెప్పారు. వైద్యుల వైఖరిలో మార్పు రావా లన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏసియన్‌ గ్యాస్ట్రో ఎంట రాలజీ చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యులు తమ కుటుంబ జీవితాన్నే వృత్తికి అంకితం చేస్తున్నారని, తమను వరిస్తున్న ప్రతి అవార్డు తమ బాధ్యతను మరింత పెంచుతుందన్నారు. ప్రముఖ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏజీ గురవారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. నూటికి తొంబై శాతం మంది వైద్యులు మానవతా దృక్పధంతోనే వైద్యసేవలు అందిస్తున్నారని, ఒకరిద్దరి వల్ల వృత్తికి కళంకం ఏర్పడుతోందని తెలిపారు. 

ప్రముఖ వైద్యులకు సన్మానం.. 
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి (జీవిత సాఫల్య పురస్కారం), ప్రముఖ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏజీ గురవారెడ్డి (డాక్టర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డు), ప్రముఖ గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్‌ ఏజీకే గోఖలే (మోస్ట్‌ ఫిలాంత్రోఫిక్‌ డాక్టర్‌ అవార్డ్‌), ప్రముఖ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ జీపీవీ సుబ్బయ్య (రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ మెడిసిన్‌ అవార్డు), ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మానస్‌ ప్రాణిగ్రహి, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అనురాధ(ఉత్తమ డాక్టర్స్‌ దంపతులు)లను అవార్డులతో సన్మానించారు. డాక్టర్‌ ఎంఎస్‌గౌడ్‌(ఉత్తమ డెంటిస్ట్‌), డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి(ఉత్తమ న్యూరాలజిస్ట్‌), డాక్టర్‌ మంజుల అనగాని(ఉత్తమ గైనకాలజిస్ట్‌), డాక్టర్‌ దశ రథరామిరెడ్డి(ఉత్తమ ఆర్థోపెడిక్‌ సర్జన్‌), డాక్టర్‌ దినే ష్‌కుమార్‌(ఉత్తమ పీడియాట్రిషన్‌), డాక్టర్‌ సోమశేఖర్‌రావు(ఉత్తమ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌), డాక్టర్‌ చిన్మయి(ఉత్తమ ఫీటల్‌మెడిసిన్‌), డాక్టర్‌ శ్రీనివాసకుమార్‌ (ఉత్తమ కార్డియాలజిస్ట్‌)లను సన్మానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top