రబీ విత్తనాలు రెడీ

Rabi seeds ready - Sakshi

4.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో..

వరి విత్తనాలే అధికం.. వ్యవసాయ శాఖ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రబీ విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 4.19 లక్షల క్వింటాళ్ల వివిధ విత్త నాలు రబీకి అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో వరి విత్తనాలే 3.16 లక్షల క్వింటాళ్లున్నాయి. వీటిలో 25 వేల క్వింటాళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, ప్రస్తుత ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి కార్యక్రమం కింద మరో 2.91 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేయనున్నారు.

వరిలో ఎంటీయూ–1010 విత్తనాలు 1.22 లక్షల క్వింటాళ్లు, బీపీటీ–5204 విత్తనాలు 87,654 క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. కేఎన్‌ఎం–118 వరి విత్తనాలను 57,740 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌–15048 విత్తనాలను 31 వేల క్వింటాళ్లు సరఫరా చేస్తారు. అలాగే ఎంటీయూ–1061, ఎంటీయూ–1001, జేజీఎల్‌–18047 రకం వరి విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నారు.

ఇవిగాక 64,880 క్వింటాళ్ల శనగ విత్తనాలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. అయితే వీటిని సబ్సిడీపై అందజేయనున్నా రు. ఎంత సబ్సిడీ ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయించనున్నారు. ఇటీవల విస్త్రృతంగా వర్షాలు కురవడం, జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో రబీలో వరి సాగు భారీగా పుంజుకోనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా కొత్తగా పూర్తయ్యే ప్రాజెక్టుల కింద అదనంగా 6.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుండటంతో ఆ మేరకు అదనంగా వరి విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top