ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

Psycho Hulchal In RTC Bus At Kothagudem District - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. బస్సులోని మహిళ కండక్టర్‌పై దాడికి యత్నించడమే కాకుండా, ఒక ప్రయణికున్ని కూడా గాయపరిచాడు. జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా మధ్య ఈ ఘటన చోటుచేసకుంది.  వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట రింగ్‌రోడ్డు వద్ద బస్సు ఎక్కిన సైకో.. సత్తుపల్లికి టికెట్‌ ఇవ్వమని కండక్టర్‌ను అడిగాడు. అందుకు కండక్టర్‌ డబ్బులు అడగ్గా.. డబ్బులు లేవని చెప్పి దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్‌చల్‌ చేసిన సైకో.. కొద్దిసేపటికే బస్సు దిగి పారిపోయాడు. తర్వాత సైకోను వెంబడించిన ప్రయాణికులు అక్కడికి దగ్గర్లోని మామిడి తోటలో సైకోను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న రాజుకు స్వల్ప గాయలైనట్టు గా తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top