డిజిటల్‌ ప్రయోగాలతోనే మీడియా ముందుకు

Post Covid-19: A Game changer for the Digital revolution In Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :కోవిడ్‌-19 ప్రపంచ దేశాలకు అనేక కొత్త సవాళ్లను తెరమీదకు తెచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఆయా దేశాలు విధించిన లాక్‌డౌన్‌ లేదా షట్‌డౌన్‌ వంటి ప్రయోగాలు అనేక రంగాలను చిన్నాభిన్నం చేశాయి. కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అందులో మీడియా రంగం కూడా ఒకటి. లాక్‌డౌన్‌తో ఎదురైన అనుభవాలు మీడియా రంగంలో సమూల మార్పులను సూచిస్తుండగా, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులను కల్పించింది కూడా. ప్రత్యేకించి మీడియాలో డిజిటల్‌ రంగం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియాపై దృష్టి సారించడమే కాకుండా తగిన వ్యూహాలను రచిస్తున్నాయి. (ప్రింట్ను దాటనున్నడిజిటల్)

ఈ తాజా పరిస్థితులు శరవేగంగా మారుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని ‘ఎక్చేంజ్‌ ఫర్‌ మీడియా’ సంస్థ ‘ఈ ఫర్‌ యమ్‌ ఇండియా బ్రాండ్‌ కాన్‌క్లేవ్‌ - సౌత్‌ వర్చువల్‌ సిరీస్‌’  పేరుతో మీడియా రంగంలో నిష్ణాతులైన వారితో ఒక చర్చా గోష్ఠిని నిర్వహించింది. ‘డిజిటల్‌ న్యూస్‌ : కంజ్యూమర్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ మోనిటైజేషన్‌ పోస్ట్‌ కోవిడ్‌ -19’  అన్న అంశం ఇతివృత్తంగా గోష్టి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ది గ్లిట్చ్‌ కో- ఫౌండర్‌, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ రాజ్‌ అధ్యక్షత వహించారు. వికటన్‌ గ్రూప్‌ ఎమ్‌. డి బి. శ్రీనివాసన్‌, నెట్‌వర్క్‌ 18 డిజిటల్‌ అండ్‌ కార్పొరేట్‌ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ పునీత్‌ సింగ్వీ, సాక్షి, ఐటి అండ్‌ డిజిటల్‌ ప్రెసిడెంట్‌ బొల్లారెడ్డి దివ్య, మనోరమ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ బాబి పౌల్‌ పాల్గొన్నారు. చర్చల్లో పాఠకులు, నిపుణుల నుంచి వచ్చిన అనేక సందేహాలకు వారు సమాధానాలిచ్చారు. (ఇక పాఠకుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత)

కోవిడ్‌-19 నేపథ్యంలో డిజిటల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ -19 తర్వాత దీనిని ఇలాగే ఎలా కొనసాగిస్తారు? ఫేక్‌ న్యూస్‌ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంస్థ ఆదాయ మార్గాలు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడున్న క్లయింట్స్‌తో పాటు అదనంగా కొత్త వారిని ఎలా ఆకర్షిస్తారు?  భవిష్యత్‌లో మీడియాలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పాత్ర  లాంటి అనేక ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. అదే విధంగా ఈ-పేపర్‌ సబ్‌స్కిప్షన్ ధరల నిర్ణయం లాంటి అనేక కీలక అంశాలపై చర్చ సాగింది. కీలకమైన అలాంటి అనేక సందేహాలపై నిపుణులు ఏమన్నారో ఈ వీడియో చూడండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top