'పొన్నం సుగర్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి' | Ponnam Prabhakar begins indefinite hunger strike for medical college | Sakshi
Sakshi News home page

'పొన్నం సుగర్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి'

Aug 7 2017 12:18 PM | Updated on Sep 11 2017 11:31 PM

కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మూడో రోజుకు చేరింది.

కరీంనగర్: కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మూడో రోజుకు చేరింది. పొన్నం ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేశం ఆయనకు వైద్య పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్‌ పడిపోయాయని, నీళ్లు తాగుతుండాలని, దీక్ష విరమించుకోవాలని సూచించారు. లేకుంటే మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతుందన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని డాక్టర్‌ రాజేశం తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని పొన్నం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement