నాగల్‌గొంది.. తీరిన రంది

Poling Booth Established in Nagalgondi - Sakshi

పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు

70 ఏళ్లకు మంజూరు..  తీరిన ఓటర్ల కల

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

కెరమెరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వా రు అనుభవిస్తున్న కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. కెరమెరి తహసీల్దార్‌ ప్రమోద్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్న గ్రామంలోనే పోలింగ్‌  కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఓటర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల  తర్వాత అక్కడి ఆదివాసీలకు  ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావిస్తున్నారు.

ఏళ్ల కష్టాలు దూరం.. 

మండలంలోని కరంజివాడ గ్రామ పంచాయతీ లోని నాగల్‌గొంది, కొలాంగూడ గ్రామాల్లో 379  జనాభా ఉంది. అందులో పురుష ఓటర్లు 113 కా గా.. మహిళలు 106 మొత్తం  219  ఓటర్లు ఉన్నా రు. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇందాపూర్, లేదా నిషాని  గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారు. 70 ఏళ్లలో ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వారికి కష్టాలు తప్పలేదు. ఇందాపూర్‌కు వెళ్లాలంటే 15 కిలోమీ టర్లు కాగా, నిషాని గ్రామం 18 కిలోమీటర్ల దూ రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ కాలంలో ఏ ఎన్ని కలు జరిగిన వారు పాదయాత్రగా వెళ్లక తప్పలే దు.

 చాలా సందర్భాల్లో వానకు తడుస్తూ, ఎండ కు ఎండుతూ.. చలికి వణుకుతూ వెళ్లి ఓట్లు వేశా రు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వారు దూరభా రం అధికమవుతుందని దగ్గర్లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ఓటర్లు కోరినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. పోలింగ్‌ కేంద్రాల మార్పు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికి మనకెందుకులే అనుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఓటు వేసేందుకు కష్టాలు చవిచూశారు.

 సాక్షి, తహసీల్దార్‌ ప్రత్యేక చొరవ

ఈ విషయమై డిసెంబర్‌ 7న సాక్షి దినపత్రికలో ‘ఓట్ల కోసం తప్పని పాట్లు’ అనే కథనం ప్రచురి తం కావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కెరమెరి తహసీల్దార్‌ ప్రమోద్‌ను వేడుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ అక్కడి ఓటర్లు, జనాభా తదితరాల వివరాలను  సేకరించారు. అక్కడి ఓట ర్లు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న విష యం వాస్తవమేనని గ్రహించిన ప్రమోద్‌కుమార్‌ వెంటనే నాగల్‌గొందిలోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పా టు చేశారు. నేడు జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు వారు నాగల్‌గొంది గ్రామంలో ఏర్పాటు చేసిన పో లింగ్‌ బూత్‌ సంఖ్య 90లో  ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దూరభారం తగ్గింది

 చాలా కాలంగా ఓట్లు వేయడానికి  పడుతున్న కష్టం ఎట్టకేలకు  ముగిసింది. ఇక చక్కగ తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రెవెన్యూ అధికారులు కల్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక , దూరభారం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. 
                           – మధుకర్‌ సర్పంచ్, నాగల్‌గొంది 

ఓటర్ల బాధలు చూసి.. 

ఓటర్లు టు వేసేందుకు పడుతున్న బాధనలు చూ సి వారు ఉండే గ్రామంలోనే పోలింగ బూత్‌ కేంద్రం ఏర్పాటు చే యాలని భావించాం. వెంటనే అధికారులకు నివేదికలు సమర్పించండంతో అక్కడ నూతనంగా పోలింగ్‌ బూత్‌ కేంద్రం మంజూరైంది. దీనికి ‘సాక్షి’ కూడా తోడైంది. ప్రజల బాధలు తీరాయి. దూరభారం తగ్గింది.
                       – వి.ప్రమోద్, తహసీల్దార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top