రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు | Police conduct search in Nizamabad Railway station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు

May 22 2015 7:45 PM | Updated on Sep 17 2018 6:26 PM

రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు - Sakshi

రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు

నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 80 మంది పోలీసులు రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల బ్యాగులను, అన్ని రైళ్లనూ తనిఖీ చేశారు. దీంతో ఎక్కడేం జరిగిందోనని ప్రయాణీకులు ఆందోళన చెందారు.

సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ ఎస్.జి. జగదీశ్వరప్ప ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ ఏఆర్, నిజామాబాద్ రైల్వే పోలీసులతోపాటు జిల్లాలోని బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే ప్రతి రైలునూ తనిఖీ చేశారు. ప్రయాణీకులు తమ బ్యాగులు, ఇతర వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని డీఎస్పీ జగదీశ్వరప్ప సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement