
పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రసమయి
ఇల్లంతకుంట : ప్రజల దీవెనలే కేసీఆర్ సర్కారుకు కొండంత అండగా ఉన్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని తిప్పాపూర్‌లో గ్రామపంచాయతీ, యాదవసంఘం, మహిళా సంఘ భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎస్సీ, మున్నూరుకాపు సంఘం, బస్టాండ్ భవనాలకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వేలాది కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని, కావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ మంజుల, గుండ సరోజన, రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సంధ్యారాణి, మల్లయ్య, శ్రీనివాస్, గొడుగు తిరుపతి పాల్గొన్నారు.