పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన | parents Protest in front of the school | Sakshi
Sakshi News home page

పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

Feb 22 2016 1:23 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం అతడి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం అతడి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాలివీ... మిర్యాలగూడ మండలం తుంగపాడు పంచాయతీకి చెందిన ఓ బాలుడు మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తెలుగు రాయటం సరిగా రావటం లేదని ఆగ్రహం చెందిన ఉపాధ్యాయుడు సదరు బాలుడిని శనివారం కర్రతో కొట్టాడు. శరీరంపై వాతలు రావటం చూసి ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు, బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిర్వాహకులు వారికి సర్దిచెప్పటంతో ఆందోళన విరమించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement