అతను తిరిగిన ప్రాంతాలపై నిఘా.. | Officials Focus on DSP And His Son Contact People Khammam | Sakshi
Sakshi News home page

భయం.. భయం

Mar 26 2020 11:38 AM | Updated on Mar 26 2020 11:38 AM

Officials Focus on DSP And His Son Contact People Khammam - Sakshi

లాక్‌డౌన్‌తో పాల్వంచ–భద్రాచలం జాతీయ రహదారి ఇలా వెలవెల

కొత్తగూడెంరూరల్‌: జిల్లా వాసులు కరోనా మహమ్మారి భయంతో వణుకుతున్నారు. కొత్తగూడెంలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఇక్కడి వారు భయపడుతున్నారు. రాష్ట్రంలో 39 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.తొలుత అశ్వాపురానికి చెందిన ఇటలీ విద్యార్థినికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ సెంటర్‌లో మెరుగైన వైద్యసేవలు అందించాక తాజాగా కోలుకుంది. ఆమెకు కరోనా తగ్గిందని, నెగిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం కొత్తగూడెం డీఎస్పీ అలీ, ఆయన కుమారుడు ఆవాజ్, వంట మనిషికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో కొత్తగూడెం పట్టణ ప్రజలు, పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు.

అతను తిరిగిన ప్రాంతాలపై నిఘా..
డీఎస్పీ అలీ కుమారుడు ఆవాజ్‌ లండన్‌ నుంచి గత పది రోజుల కిత్రం కొత్తగూడెంకు వచ్చాడు. అప్పటి నుంచి చుంచుపల్లి మండలంలో ఓ షాపింగ్‌ మాల్‌తో పాటు, ఇతర సేహ్నితులతో పెళ్లి, పార్టీకి వెళ్లాడు. పాల్వంచలోని తన బంధువులను సైతం కలిశాడు. కొత్తగూడెం పట్టణంలోని ఓ సెలూన్‌ షాపులో క్షవరం చేయించుకున్నాడు. పోలీసు శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చుంచుపల్లిలోని షాపింగ్‌ మాల్‌కు సంబంధించిన సీసీ పుటేజీలను పరిశీలించారు. ఆవాజ్‌ కొత్తగూడెంకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో విచారణ చేస్తున్నారు. తండ్రి, కొడుకులు కొత్తగూడెంలో ఎవరెవరిని కలిశారో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.  

ఇటలీ నుంచి అశ్వాపురం మొదట ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థినికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆమె కోలుకుంది.
లండన్‌ నుంచి కొత్తగూడెండీఎస్పీ ఎస్‌ఎం.అలీ కుమారుడు లండన్‌ నుంచి వచ్చాడు.అతడి ద్వారా డీఎస్పీతో పాటు,మరొకరికి కరోనా వచ్చింది.
21మంది తరలింపు..డీఎస్పీ, ఆయన కుమారుడు,వారు ఇటీవల కలిసిన బంధువులనువైద్య పరీక్షలకు తరలించారు.
16మందికి నెగిటివ్‌ రిపోర్టు కానిస్టేబుళ్లు, గన్‌మెన్లు21మందిని హైదరాబాద్‌కు తరలించారు.
ఐదుగురి వైద్య పరీక్ష తేలాల్సి ఉంది.
కరోనా నిర్ధారణ పరీక్షకు పంపించిన వారిలో వివరాలు వెల్లడి కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement