అనారోగ్యంతో నైజీరియా విద్యార్థి మృతి | nizerian student dies in hyderabad | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో నైజీరియా విద్యార్థి మృతి

Sep 4 2015 11:36 PM | Updated on Jul 29 2019 5:43 PM

నైజీరియాకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

హైదరాబాద్: నైజీరియాకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఉస్మాన్ (22) టోలిచౌకి అల్‌హస్నాత్ కాలనీలో ఉంటూ నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఉస్మాన్ తన స్నేహితుల సలహా మేరకు లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement