అత్తింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు
పాపన్నపేట(మెదక్): ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కలిసి అత్తింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని ఎల్లాపూర్‌లో చోటు చేసుకుంది. అబ్బాయి కుటుంబీకుల కథనం పక్రారం... గ్రామానికి చెందిన ఓ యువకుడు, కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్‌కు చెందిన యువతిని ఈ నెల 6న పెళ్లి చేసుకొని, పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇద్దరు మేజర్ కావడంతో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
అయితే అమ్మాయి, యువకుడితోనే ఉంటానని చెప్పడంతో ఆమెను అత్తింటికి పంపించారు. కాగా బుధవారం అమ్మాయి తరపు వారు మూడు కార్లలో ఎల్లాపూర్‌కు వచ్చి అడ్డొచ్చిన యువకుడిని, అతడి తల్లి శ్యామలను, అన్నావదినెలను ప్రక్కకు తోసేసి, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ మేరకు వారు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ను వివరణ కోరగా ఇరు వర్గాలను మెదక్ సీఐ కార్యాలయానికి పిలిపించి, కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులు
మెదక్ జిల్లా సలాబత్పూర్ గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 6వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్న ఎల్లపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు
కులాంతర వివాహం చేసుకుందని కోపంతో ప్రణయ్ కుటుంబ… https://t.co/TrWxGlOzHW pic.twitter.com/PZPlxvNc0P— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026


