రాష్ట్ర సీఎం కేసీఆర్ 14న కొత్త పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు పంచ జెండా ఊపనున్నారు.
	హైదరాబాద్ : రాష్ట్ర సీఎం కేసీఆర్ 14న కొత్త పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు పంచ జెండా ఊపనున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందుగానే 14న ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మొదటి విడతగా 300 ఇన్నోవాలు, 500 ద్విచక్ర వాహనాలను నగరపోలీసు శాఖకు అందజేయనున్నారు.
	
	ఈ కార్యక్రమం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలలో 14న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ట్యాంక్‌బండ్‌పై వాహన రాకపోకలను నిషేదించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
