మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

New Policy iplementation In Telangana Grama panchayath - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : గ్రామాల్లో మొక్కుబడిగా నిర్వహించే గ్రామ సభలు, సమావేశాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. ఇకనుంచి గ్రామసభలు, సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేందుకు కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ ప్రగతి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సభలు, పంచాయతీ సమావేశాలు కీలకం. ఇప్పటివరకు మొక్కుబడిగా సాగినా ఇకనుంచి బాధ్యతాయుతంగా నిర్వహించనున్నారు. రెండు నెలలకోసారి గ్రామసభ, నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి. లేదంటే సర్పంచ్‌ పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు.  

మండలంలో 37 జీపీలు.. 
ఆదిలాబాద్‌ ఉమ్మడి మండలంలోని ఆదిలాబాద్‌రూరల్‌లో 34 గ్రామపంచాయతీలు ఉండగా, నూతనంగా ఏర్పాటైన మావల మండలంలో 3 గ్రా మాలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో ఇదివరకు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించేవారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇకనుంచి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేనియేడల అధికారులు చర్యలు తీసుకుంటారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సమావేశాలను సకాలంలో నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. 

కోరం ఉండాల్సిందే.. 
గ్రామసభకు జనాభాను బట్టి ప్రజలు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామాల్లో 500 ఓటర్లు ఉంటే 50 మంది, 3వేల మంది ఓటర్లు ఉంటే 150 మంది, 5వేల మంది ఓటర్లు ఉంటే 200 మంది, 10వేల మంది ఓటర్లు ఉంటే 300 మంది, అంతకుమించి ఉంటే 400 మంది గ్రామసభలకు హాజరుకావాల్సిందే. కొత్త చట్టం ప్రకారం ఏడాదికి ఆ రుసార్లు నిర్వహించాలి. తేదీ, సమయం ముందుగా ఊరిలో ప్రచారం చేయాలి. ఒకవేళ నిర్ణయించిన తేదీన గ్రామసభ జరగకపోతే తిరిగి పది రో జుల్లో నిర్వహించాలి. సర్పంచ్‌ లేకుంటే ఉప సర్పంచ్‌ ఆధ్వర్యంలోనైనా ఏర్పాటు చేయాలి.  

జాప్యం కుదరదు.. 
గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఫిబ్రవరి 2న ఏర్పాటయ్యాయి. మార్చి చివరి నాటికి మొదటసభ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినా సభలు నిర్వహించకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏడాదికి నాలుగుసార్లు.. 
పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందు కు 73 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను చేర్చా రు. వివిధ సంక్షేమ పథకాల విధులు, పారదర్శకంగా నిర్వహించేలా గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి చేసేలా పంచాయతీ సమావేశాలు పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ రెండునెలలకోసారి గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలి. అలాగే పంచాయతీ పాలకవర్గ సమావేశాలు నెలనెలా నిర్వహించాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top