సిరిసిల్లలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి  | Multi Super Specialty Hospital in Sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి 

May 12 2018 2:58 AM | Updated on Oct 9 2018 7:52 PM

Multi Super Specialty Hospital in Sircilla - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 300 పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రూ.158.70 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

15 రకాల వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేకమైన గదులను, 10 శస్త్ర చికిత్స గదులను నిర్మించనున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గుండె, నరాలు, క్యాన్సర్, ఛాతి, జీర్ణాశయం, మూత్ర పిండాలు, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి కీలక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement