పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | MLCs sworn in by council of chairman | Sakshi
Sakshi News home page

పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Mar 31 2015 1:45 AM | Updated on Sep 2 2017 11:36 PM

పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), రామచందర్‌రావు (బీజేపీ) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు.

ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్
అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన  ఇద్దరు ఎమ్మెల్సీలు
 
 సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), రామచందర్‌రావు (బీజేపీ) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. శాసనమండలి జూబ్లీహాలులో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తొలుత గన్‌పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మండలికి చేరుకున్నారు.  రాజేశ్వర్‌రెడ్డితో స్వామిగౌడ్,ఉదయం 11.33 గం టలకు  ప్రమాణ స్వీకారం చేయించారు. ‘టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై, ఐనె తిక పొత్తులతో ప్రయత్నించాయి. కానీ, పట్టభద్రు లు టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో నన్ను గెలిపిం చారు.  వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..’ అని రాజేశ్వర్‌రెడ్డి ఆ తర్వాత మీడియాతో అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
 
  పల్లా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ,  మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎంపీ జితేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కళిం గ భవన్‌లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించారు.  మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రామచందర్‌రావు వెంట బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వచ్చారు. రామచందర్‌రావు ఉద యం 10.45 గంటలకు  ప్రమాణ స్వీకారం చేశారు. ‘నన్ను గెలిపించినవారి రుణం తీర్చుకుంటా. నిరుద్యోగుల అంశాలను మండలిలో ప్రస్తావిస్తా. ప్రజలపక్షాన పోరాడుతా..’ అని   పేర్కొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలసి గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement