ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం: జీవన్‌ రెడ్డి

MLC Jeevan Reddy Slams KCR On Budget - Sakshi

ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు

కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం

కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదు: జీవన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉందన్నారు. తొమ్మిది నెలల ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్‌ను నిదర్శమన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.

2019-20 సంవత్సరానికి రూ.1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగించింది. రుణమాఫీపై బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగుల ఉపాధికల్పన, నిరుద్యోగ భృతిపై బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం బాధాకరం. కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమీషన్‌ల బాగోతం బయటకు వస్తోందనే.. కాళేశ్వరానికి జాతీయ హోదా అడగడం లేదు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే... కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలి’ అని అన్నారు.

చదవండి: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ఐఆర్‌, పీఆర్సీ పై బడ్జెట్ ప్రస్తావనలేదు: ఎమ్మెల్సీ నర్సీరెడ్డి 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉంది. ఆర్ధిక అంచనాలను అంచనా వేయడంలో ప్రభుత్వ విఫలమయ్యింది. 5 నెలల కింద ప్రవేశపెట్టిన లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఎందుకు తగ్గింది. రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు. రాష్ట్రంలో  59 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్సీపై బడ్జెట్ ప్రస్తావనలేదు. ఆర్థిక మాంద్యంను తట్టు కునే విధంగా బడ్జెట్ రూపొందించాలి.

నిరాశాజనకంగా బడ్జెట్ ఉంది: ఎమ్మెల్సీ రామచందర్ రావు
రూ.36 వేలకోట్ల లోటు బడ్జెట్‌పై చర్చ జరగాలి. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను పూర్తి చేయలేక కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top