కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే | mla yadaiah stars foot journey to tirupathi in rangareddy district | Sakshi
Sakshi News home page

కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే

Jan 27 2015 10:11 AM | Updated on Oct 5 2018 8:51 PM

కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే - Sakshi

కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య తిరుపతికి కాలినడకన వెళుతున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య తిరుపతికి కాలినడకన వెళుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే పాదయాత్రతో తిరుపతికి వస్తానని ఆయన మొక్కుకున్నారు. దీంతో ఆయన సోమవారం తన స్వగ్రామమైన నవాబ్‌పేట మండలం చింతలపేట నుంచి తిరుపతికి కాలినడకన బయలుదేరారు.

చేవెళ్లకు మంగళవారం చేరుకున్న ఎమ్మెల్యే యాదయ్య బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని వేంకటేశ్వర స్వామిని దర్శించారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఈ యాత్రకు చేవెళ్లలో స్వాగతం పలికారు. అయితే కాలే యాదయ్య కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్ లో కొనసాగుతున్నారు. గత నవంబర్లో యాదయ్య టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement