
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు.